శ్రీదేవి అంటే పిచ్చి. ఓకే. ఆమెను చూసేందుకు రోజులతరబడి పడిగాపులు కాసేవాడు. డబల్ ఓకే. ఆ సౌందర్యరాశిని ఆరాధించాడు. మూగగా ప్రేమించాడు. తన కలల దేవతనే హీరోయిన్‌గా పెట్టి సిన్మాలు కూడా తీశాడు. ట్రిపుల్ ఓకే. కానీ శ్రీదేవి మరణంతో అభిమానులంతా విషాదంలో మునిగిపోతే వర్మ పైత్యం ఇంకాస్త శృతిమించింది. గంటగంటకీ కామెంట్స్‌తో శ్రీదేవి అభిమానసంఘానికి జాతీయ అధ్యక్షుడినన్నట్లు వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

“చాలా మంది నేను ఏడ్చేస్తున్నాను అనుకుంటున్నారు.. కానీ నాకు చాలా కోపంగా ఉంది.
ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆమెను ఓ దేవతగా చూస్తున్నాను.. ఆ లోకంలోనే బతికాను. ఆమె చనిపోయి.. తానూ మామూలు మనిషినేనని రుజువు చేసింది. నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. ఎందుకంటే మామూలు మనుషులూ చనిపోయి..శ్రీదేవికూడా అ అలాగే పోతే… ఇంకేముంటుంది.”.

“నేను కలలు కంటుంటాను. అర్ధరాత్రి ఓ సారి చూస్తే… శ్రీదేవి గురించి అన్ని మెసేజ్ లు చూశాను. అది నమ్మలేకపోయాను.
నాకు తెలిసిన వేరే శ్రీదేవి ఉన్నారనుకున్నాను. కల కంటున్నా అనుకున్నాను. మళ్లీ నిద్రపోయాను. తెలిసిన వారికి ఫోన్ చేసి కనుకున్నాను. వారి నిర్ధారించాను. మెంటల్ బ్లాక్ వచ్చేసింది. తనతో చేసిన పాటలు .. జామురాతిరి గుర్తుకు వచ్చాయి. వాటిని గుర్తు చేసుకొనేసరికి ఓ ఉద్వేగం వచ్చేసింది.

“నిజమైన భక్తుడికి దేవత ఒక్కరే ఉంటారు. నేను దేవుణ్ని నమ్మను. ఎందుకు పుట్టాం.. ఎందుకు బతుకుతున్నాం.. అనుకున్నప్పుడు నా జీవితంలో శ్రీదేవి ఒక కారణం.
కోట్లలో ఒకరు ఆమె. దేవుడు చాలా వరకు చెత్త పనులు చేస్తుంటాడు. కానీ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు దేవుడు యుగానికి ఒక్కసారి శ్రీదేవి లాంటి వారిని సృష్టిస్తాడు. ఇప్పుడు ఆయనను కొడదామన్న కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేశాడనిపిస్తోంది.”

ఇంత మోసం చేస్తావా..అలా నిన్ను చూడలేను..
“ఆమె పోయారన్న వార్త నాకు కర్ణకఠోరంగా ఉంది. ఆమె ఇంకా బతికే ఉన్నారన్న ఆలోచనలో ఉన్నాను. ఆమె అంత్యక్రియలకు నేను వెళ్లను. ఆమె ఫొటోలను చూడను.. శ్మశానానికి వెళ్లను.”

