
నవతరం, ప్రత్తిపాడు: బి.సి నేత మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ప్రత్తిపాడులో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వరుపుల రాజా ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. రాజా టీడీపీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడులో అంబేద్కర్ విగ్రహంనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం “ర్యాలీ”గా ప్రత్తిపాడు కూడలికి వెళ్లి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా రాజా మీడియాతో మాట్లాడుతూ వెనుక బడిన వర్గాల ”గొంతు” అయిన అయ్యన్న పాత్రుడు గార్ని అర్ధ రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నారు. రాష్టంలో ప్రజా సమస్యలుపై నిరంతరం గళం విప్పే అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేసి రాష్ట ప్రభుత్వం బి. సి ల గొంతు నొక్కాలి అని ప్రయత్నిస్తోంది అన్నారు. అయ్యన్న పాత్రుడుని విడిచి పెట్టే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. అయ్యన్నను ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలి అని రాజా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

