నవతరం, న్యుఢిల్లీ: 2026 ఆగస్టు 20న 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం “పరిశ్రమ” నిర్వచనంపై ఇచ్చిన మెజారిటీ న్యాయమూర్తుల తీర్పు కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టు లాంటిది.
దీనిపై సీఐటీయూ తక్షణం స్పందించింది. తీర్పు అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించింది.
ఇదే నేపథ్యంలో ఆగస్టు 26న ‘ది హిందూ’ దినపత్రిక సంపాదకీయం రాసింది.
ఆగస్టు 25న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ, న్యాయవాది మైత్రేయ కృష్ణన్ 9 మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును తప్పుపడుతూ ది హిందూ పత్రికలో ఒక వ్యాసం రాశారు.
ఆ తీర్పు కేవలం కార్మిక వర్గానికే కాదు, భారత పారిశ్రామిక రంగానికి కూడా ప్రమాదకరమే.
ప్రైవేటీకరణ, ఎలాంటి భద్రత లేని తుమ్మితే ఊడిపోయే లాంటి పరిస్థితులు, కార్మిక సంఘాల ఏర్పాటునే సహించక యాజమాన్యాలు బరితెగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.
ఇటువంటి కాలంలో 2026 ఆగస్టు 20న సుప్రీంకోర్టు తీర్పు అత్యంత ప్రమాదకరం. ఆ తీర్పు, నేపథ్యం, పూర్వాపరాలు తెలుసుకోవాలి.
కృష్ణయ్యర్ ప్రతిపాదించిన “ట్రిపుల్ టెస్ట్”.. 1978లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ నేతృత్వంలోని 7 గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ‘బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ వర్సెస్ ఏ రాజప్ప(బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ)’ కేసులో పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 2(జే) కింద “పరిశ్రమ” నిర్వచనాన్ని నిర్ణయించడానికి “ట్రిపుల్ టెస్ట్” అనే సూత్రాన్ని ప్రతిపాదించింది. అంటే ఒక పరిశ్రమగా పరిగణించబడటానికి మూడు నిబంధనలు ఉండాలి.
1. క్రమబద్ధమైన కార్యకలాపాలు
2. యజమాని-ఉద్యోగుల సంబంధం
3. కేవలం మతపరమైన లేదా ఆధ్యాత్మికమైనవి కాకుండా మానవ అవసరాలను తీర్చే వస్తువులు, సేవల ఉత్పత్తి/పంపిణీ. లాభాపేక్ష అనేది ఇక్కడ సంబంధం లేని అంశం. ఈ తీర్పులోని ప్రధాన అంశం కార్యకలాపాల స్వభావం మాత్రమే. కేవలం “దాతృత్వ/స్వచ్ఛంద విధులు” (సావరిన్ ఫంక్షన్స్) మాత్రమే పరిశ్రమ నిర్వచనం కిందకు రావు. ఈ తీర్పు భారతదేశ కార్మికోద్యమంలోనూ, పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మకమైనది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏం చెబుతోంది?
అయితే 2005లో ‘స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ జై బిర్ సింగ్’ కేసులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పులోని నిర్వచనంపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. దాంతో ఆ కేసు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించబడింది.
ఆ ఏడుగురు న్యాయమూర్తులు కేసు ప్రాధాన్యత రీత్యా 2017 జనవరి 2న తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపారు.
ఫిబ్రవరి 16న తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసు విచారణకు 4 ప్రశ్నలను రూపొందించింది.
అప్పటికే పారిశ్రామిక వివాదాల చట్టం రద్దయింది. లేబర్ కోడ్ అమలులోకి వచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, 2026 ఆగస్టు 20న తుది తీర్పునిచ్చింది.
2025 నవంబర్ 21న పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 అమలులోకి వచ్చి, పాత ఐడీ చట్టం రద్దయ్యే వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలకు ట్రిపుల్ టెస్ట్ విధానం వర్తిస్తుందని ఆ తీర్పు స్పష్టం చేసింది.
కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత తలెత్తే వివాదాలకు కృష్ణయ్యర్ తీర్పు వర్తించదని చెప్పింది.
అయితే, తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో మెజారిటీ న్యాయమూర్తులు(5 గురు) పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020లోని సెక్షన్ 2(పీ) నేపథ్యంలో పరిశ్రమకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు వర్తించదు అని తీర్పు చెప్పారు.జస్టిస్ నాగరత్న భిన్నాభిప్రాయం..
9 మంది న్యాయమూర్తులలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయంతో విభేదించారు. అసలు ఈ కేసు 9 మంది న్యాయమూర్తుల బెంచ్‌కి పంపాల్సిన అవసరం లేదని, జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పులోని ట్రిపుల్ టెస్ట్‌లో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, దాన్ని యథాతథంగా కొనసాగించాలని తన భిన్నాభిప్రాయాన్ని తెలియజేశారు.
జస్టిస్ నాగరత్న అభిప్రాయంతో మరొక ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఏకీభవించారు.
జస్టిస్ నాగరత్న వాదన చాలా బలమైనదిగానూ, నేటి పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది.
“1991 నుంచి మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యం చేయబడి ప్రైవేట్ రంగం ఆధిపత్యంలోకి వచ్చింది. ప్రైవేట్ రంగంలో కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందువల్ల, ట్రిపుల్ టెస్ట్‌లో చెప్పినట్లు పరిశ్రమకు విశాలమైన నిర్వచనం ఇవ్వడం అనేది కార్మికునికి రక్షణగా ఇప్పుడు చాలా అవసరం” అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.పారిశ్రామిక ప్రశాంతతకు విఘాతం..
అదే సందర్భంలో, పారిశ్రామిక కోడ్‌లోని సెక్షన్ 2(పీ) అనేది బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ కేసులోని జస్టిస్ కృష్ణయ్యర్ ట్రిపుల్ టెస్ట్ సూత్రానికి భిన్నమైనది కాదు.
ఆ సూత్రంలోని సారాన్ని ఎక్కువ భాగం అలాగే తిరిగి రూపొందించారు.
అందువల్ల సెక్షన్ 2(పీ)ని వ్యాఖ్యానించేటప్పుడు 1978 నాటి బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ కేసు తీర్పును పక్కన పెట్టాలని ఐదుగురు న్యాయమూర్తులు ఎందుకు భావించారో అర్థం కాదు.
ట్రిపుల్ టెస్ట్ అనేది కేవలం కార్మికులకు మాత్రమే అనుకూల సాధనం కాదు.
పరిశ్రమ నిర్వచనం ఐడీ చట్ట రక్షణలను మాత్రమే కాక దాని పరిమితులను కూడా స్పష్టం చేసింది.
ఉదాహరణకు, యజమాని ఇష్టారాజ్యంగా ఉద్యోగుల తొలగింపు, సంస్థ మూసివేతలను నియంత్రించే మార్గం, కార్మికులు వారి ఇష్టం వచ్చినట్లు సమ్మెలు చేయకుండా నిషేధం కూడా పారిశ్రామిక వివాదాల చట్టం 1947 లో ఉంది.
సారాంశంగా, ట్రిపుల్ టెస్ట్ అనేది కేవలం కార్మికుల సంక్షేమానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రశాంతతకు కూడా వీలు కల్పించింది.
మెజారిటీ న్యాయమూర్తులు తీర్పు చెప్పినట్లు, కొత్తగా తెచ్చిన కోడ్ నేపథ్యంలో ట్రిపుల్ టెస్ట్ సూత్రం వర్తించదని చెప్పడం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగపడిన చట్రాన్ని(ఇంటర్‌ప్రెటివ్ ఫ్రేమ్‌వర్క్) రద్దు చేసినట్లు అవుతుంది.భవిష్యత్ పోరాటాలకు సమాయత్తం..
“ట్రిపుల్ టెస్ట్ సారాంశం లేబర్ కోడ్ (ఐఆర్‌సీ) సెక్షన్ 2(పీ)లో కూడా ఉన్నందున, మెజారిటీ న్యాయమూర్తుల తీర్పు ఐఆర్‌సీ సెక్షన్ 2(పీ)కి ఉన్న ఆధారాన్ని తొలగించినప్పటికీ, చట్టం మారినంత మాత్రాన దాని వెనుక ఉన్న ఉద్దేశం మారలేదని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కోర్టులు, ట్రిబ్యునళ్లపై ఉంది” అని ది హిందూ సంపాదకీయం ముగించింది.
కార్మిక వర్గం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, కార్మికుల గొంతు నులిమే లేబర్ కోడ్‌ల రద్దుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి.