ఉత్తరాంధ్ర గడ్డ నుంచి రాష్ట్ర ఉద్యోగ సామ్రాజ్యాన్ని ఏలిన ధీరుడు…

0
52



ఉద్యోగం కోసం కాదు.. ఉద్యమం కోసం పుట్టిన నేత – చౌదరి పురుషోత్తం నాయుడు!
ఆముదాలవలస తాలూకా ఉపాధ్యక్షుడిగా మొదలై.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చరిత్ర సృష్టించిన దార్శనికుడు! వామపక్ష విప్లవ కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమ సింహం.. స్వాతంత్ర్య సమరయోధుల వారసుడిగా జెండా పట్టిన యోధుడు! ఉద్యోగం ఊడినా.. ఉద్యమం వీడని నిఖార్సయిన నాయకుడు రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షనర్ల కోసం అవిశ్రాంత పోరాటం! 3న ఎన్జీవో హోంలో పుట్టినరోజు వేడుకలు 6న ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి రాకతో జిల్లా అంతా పండగ వాతావరణం!
ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎదిగిన తొలి ఎన్జీవో నేత, ఉద్యోగుల హక్కుల కోసం అర్ధ శతాబ్దం పాటు అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ సూర్యుడు, వామపక్ష విప్లవ భావజాల, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ వారసుడు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్జీవోల ఆత్మబంధువు చౌదరి పురుషోత్తం నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళంలోని స్థానిక ఎన్జీవో హోంలో గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతు సాయిరాం, వల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, జిల్లా నాయకత్వం, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో కుమారుడు, పైలట్ సతీష్ వద్ద పర్యటనలో ఉన్నారని, అక్కడ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు, తన కుటుంబ మిత్రుడు నల్లి ధర్మారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, 6వ తేదీన స్వదేశానికి తిరిగి వస్తున్నారని, ఆయన రాకతో జిల్లా ఎన్జీవో వర్గాల్లో, పెన్షనర్ల వర్గాల్లో పండగ వాతావరణం నెలకొందని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.
ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తి.. ఒక చరిత్ర.. ఒక పాఠం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల ఉద్యమ చరిత్రను తిరగేస్తే చౌదరి పురుషోత్తం నాయుడికి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన, గౌరవప్రదమైన స్థానం ఉందని, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్ర ఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి నాయకుడు ఆయనేనని, అంతకు ముందు రాష్ట్ర నాయకత్వం అంతా కోస్తా, రాయలసీమకే పరిమితమై ఉండేదని, ఉత్తరాంధ్ర ఉద్యోగుల గొంతుకను రాష్ట్ర స్థాయిలో బలంగా, దీటుగా, ధైర్యంగా వినిపించిన ఘనత ఆయనకే దక్కుతుందని చరిత్ర చెబుతోందని, ఆముదాలవలస తాలూకా ఎన్జీవోల సంఘం ఉపాధ్యక్షుడిగా తన ఉద్యమ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా ఉపాధ్యక్షుడుగా, జిల్లా అధ్యక్షుడుగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా, రాష్ట్ర సహకార్యదర్శిగా, చివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సంస్థాగత ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసి తన సత్తా చాటారని, వాణిజ్య పన్నుల శాఖలో సాధారణ ఉద్యోగిగా చేరి, క్యాష్ బ్యాలెన్స్ విధానానికి శ్రీకారం చుట్టి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా, సంస్థాగతంగా ఎన్నో ప్రణాళికలు రచించి, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారని, జిల్లా ఎన్జీవోల సంఘానికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసి, వేలాది మంది ఉద్యోగులకు అండగా నిలిచారని, కొన్నిసార్లు అధికారులు ఇబ్బందులకు గురిచేసినా, ఉద్యోగుల పక్షాన నిలబడి, వారి హక్కుల కోసం పోరాడి, ఆ శాఖలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులందరికీ సుపరిచితుడయ్యారని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ మంత్రి ఉన్నా వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా, అవసరమైతే పోరాడి సాధించడమే ఆయన ప్రత్యేకత అని, దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆయన ఉద్యమ జీవితం కొనసాగిందని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, పెన్షనర్ల సమస్యల కోసం ఇప్పటికీ అవిశ్రాంతంగా పోరాడుతున్న నిఖార్సయిన నాయకుడని నాయకులు కొనియాడుతున్నారని, ఎన్జీవో ఉద్యమంలో తనకు మొదటి గురువు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ బాబు తనకు మంచి ఆత్మీయుడని, ఆయన స్ఫూర్తితోనే తాను ఉద్యమంలోకి వచ్చానని నాయుడు పలు సందర్భాల్లో చెప్పారని తెలిసింది.
ఆయన వెనుక ఉన్న కుటుంబ నేపథ్యమే ఆయనలోని పోరాట స్ఫూర్తికి, నిబద్ధతకు, నిజాయితీకి కారణమని, తాత చౌదరి సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు, హుక్కు సంఘం నాయకుడు, పదేళ్లు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేసిన ధీరుడు, తాతగారైన తిమ్మా పురుషోత్తం నాయుడు బ్రిటిష్ కాలంలో, జమిందారీ కాలంలో గ్రామానికి మునసబుగా పనిచేసి ‘చౌదరి’ అనే బిరుదు పొందారని, అసలు ఇంటి పేరు మల్లంపూడి వంశం అని, తండ్రి సత్తారావు, సోదరుడు శేషగిరిరావు సీపీఎం రాష్ట్ర నాయకులుగా వామపక్ష విప్లవ భావజాలంతో పనిచేశారని, మరో సోదరుడు నారాయణమూర్తి అలియాస్ బాబ్జీ తెలుగుదేశం పార్టీలో సర్పంచ్ గా, జెడ్పీ చైర్మన్ గా పనిచేసి, వామపక్ష, ప్రజాస్వామ్య భావజాలాల కలయికగా ఆ కుటుంబం ఉండేదని, తల్లి సంతానాన్ని నిపిడి శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారని, సోదరుడు రమేష్ చౌదరి కూడా ఉద్యోగ నాయకుడిగా ఉన్నారని, కుమారుడు అవినాష్ ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారని, మరో కుమారుడు సతీష్ గతంలో శ్రీకాకుళం ఎన్జీవోల సంఘం నాయకుడిగా పనిచేసి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పైలట్ గా స్థిరపడ్డారని, కుటుంబం మొత్తం ప్రజా సేవలోనే ఉందని, రాజకీయ అవకాశాలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సన్నిహిత సంబంధాలు, విద్యావంతుడు కావడంతో రాజకీయాల్లోకి వెళ్తారని చాలా మంది భావించారని, కానీ పదవులను తిరస్కరించి, ఉద్యోగుల సేవకే, పెన్షనర్ల సేవకే అంకితమైన మహా నేత ఆయనని, అందుకే ఆయనను ఉద్యోగుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడిగా అభిమానులు, ఉద్యోగులు, పెన్షనర్లు కొనియాడుతున్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here