
నవతరం, భీమవరం: భీమవరం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో, గర్భిణీలకు పౌష్టికాహార ఉచిత పంపిణీ కార్యక్రమం, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి, ఒక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమం నిర్వహించడం, పేదరికం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు, దాతల సహకారంతో, పౌష్టికాహారం వారందరికీ అందివ్వడం గొప్ప విశేషమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ. వీరస్వామి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమక్షంలో, గర్భిణీలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, కొప్పర్తి వీర రాఘవులు, ఎస్ ఎస్ ఎన్ మూర్తి, పేరిచర్ల సత్యనారాయణ రాజులు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి చేస్తున్న ఈ యొక్క పౌష్టికాహార పంపిణీకి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు,

