51వ జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభం…

0
286

నవతరం, భీమవరం: ఘనంగా ప్రారంభమైన, 51 వ జాతీయ భద్రతా వారోత్సవాలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి భీమవరం ఆర్టీసీ బస్ స్టేషన్ మేనేజర్ ఐ ఆర్ కే రాజు అధ్యక్షత వహించారు. జాతీయ భద్రతా వారోత్సవాలు, ప్రతి సంవత్సరం మార్చి 4న నిర్వహించబడుతున్నాయని, భద్రత, ఆరోగ్యం, వాతావరణం అనే అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి అభినందించారు. సి.పి.ఎం నాయకులు జె ఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ ఈ దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు భద్రత వారోత్సవాలు నిర్వహించబడతాయని. ఇందులో భాగంగా ప్రతిరోజు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భద్రత అవగాహన కల్పిస్తారని అన్నారు. న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, చెల్లబోయిన రంగారావులు మాట్లాడుతూ 1966 మార్చి 4న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతామండలి ఏర్పడిందని మండలి ప్రారంభమైన మార్చి 4న ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవం జరుపబడుతుందని అన్నారు. అనంతరం నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, ఉద్యోగులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. భద్రత ఆరోగ్య రక్షణను జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని భద్రతా ప్రతిజ్ఞ చేశారు.