పేదల ఆకలి తీర్చే ప్రయత్నంలో ప్రజలు భాగస్వాములు కావాలి…

0
5


నవతరం, పెదకూరపాడు: పేదల ఆకలి తీర్చే ప్రయత్నంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఆహారం వృధా చేయకండి మిగిలిన ఆహారంతో అన్నార్తులను ఆదుకుందామని జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడుకు చెందిన సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆండ్ర ప్రసాద్ నూతన గృహప్రవేశ ఫంక్షన్లో, మండలంలోని లింగంగుంట్లకు చెందిన ఎలమంచిలి బ్రహ్మతేజ, రేణుక వివాహ రిసెప్షన్లో ఆహారం మిగిలి ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆహారాన్ని సేకరించి పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు శాంతికాలని, అమరావతిలోని చెంచు కాలనీలో సోమవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఫంక్షన్ ఏదైనా ఆహారం మిగిలి ఉంటే 9885557987,8886777767 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని మిగిలిన ఆహారాన్ని వృధా కాకుండా పేదలకు పంచుతామని అన్నారు. ఈకార్యక్రమంలో చెరుకూరి శ్రీనివాసరావు, జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, ప్రతినిధులు షేక్ సుభాని, కొర్రపాటి వెంకటేశ్వర్లు, షేక్ లియాఖత్ ఆలి, దాసరి కారుణ్యబాబు,గుడిపూడి అఖిల్, దాసరి విజయ్ బెన్ని బాబు తదితరులు పాల్గొన్నారు. ఇరుప్రాంతాలలో సుమారు 500 మందికి అన్నదానం చేసినట్లు జన చైతన్య సమితి ప్రతినిధులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here