


నవతరం, ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైసిపి కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
జగన్ కంటే రెట్టింపు పథకాలు అమలు చేస్తానని రెండేళ్ల పాలనలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహిళలు, రైతులు, యువతలో ఓటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిందన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.
అమరావతి పేరుతో భారీగా అప్పులు చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆరోపించారు.రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు చేస్తుందేంటని ప్రశ్నించారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్నా అరాచకం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
2029లో మళ్లీ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణ రాజు, నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురాం, తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీల్, నాలుగు మండలాల కన్వీనర్లు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

