గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం రాష్ట్రానికి తీరనిలోటు….పవన్‌

0
341


నవతరం, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వార్త తనను కలచివేసిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ నివాళులర్పించారు. పరిశ్రమలశాఖా మంత్రిగా గౌతమ్‌రెడ్డి చొరవ అభినందనీయం. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశారు. అలాంటి వ్యక్తి హఠాన్మరణం రాష్ట్రానికి తీరనిలోటు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.