కూకట్పల్లిలో పుంజుకుంటున్న కమలం

0
132


బీజేపీ తీర్థం పుచ్చుకున్న వడ్డెపల్లి రాజేశ్వార్ రావు

కూకట్పల్లి, అక్టోబర్ 19 (నవతరం): కూకట్పల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి మాధవరం కాంతారావు అద్వర్యం లో బుధవారం నాడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వడ్డెపల్లి రాజేశ్వార్ రావు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం డిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి భుపేందర్ ఆయనకు కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నేతలు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చూఘ్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి శాంతి కుమార్, గోపి ఇతర బిజెపి నేతలు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వడ్డెపల్లి రాజేశ్వార్ రావు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం డిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి భుపేందర్ ఆయనకు కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినది.