ఏపి ఆర్టీసీకి సర్జనార్ షాక్…

0
361

మాజీ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ..

తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టుస్తున్నారు. అయితే.. తాజాగా మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో.. చాలా మంది.. సొంత ఊర్లకు వెళతారు. ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్లకు వెళతారు.

ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి సమయంలో.. ఏపీలో ఆర్టీసీ… టిక్కెట్ల ధరలను పెంచిందని.. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఏపీకి వెళ్లే ప్రయాణికులు అందరూ తెలంగాణ ఆర్టీసీ లో టికెట్లు బుక్ చేసుకోండి..డబ్బులను ఆదా చేసుకోండి అంటూ అర్థం వచ్చేలా మహేష్ బాబు సినిమా పోస్టర్ ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ పూర్తిగా ఏపీ ఆర్టీసీకి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. కాగా.. సంక్రాంతి నేపథ్యంలో… 50 శాతం చార్జీలను పెంచింది ఏపీ ఆర్టీసీ.