ఎడతెరిపిలేని వర్షాలకి నీట మునిగిన కాకినాడ రోడ్లు…

0
141

నవతవరం కాకినాడ అర్బన్: గత రెండు రోజుల నుండి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ నీటమునిగింది.చాలా చోట్ల డ్రైనేజిలు నిండిపోయి వర్షపునీటితో వీదులు, రోడ్లు నిండిపోయాయి.కాకినాడ మెయిన్ రోడ్ సినిమారోడ్డు, భానుగుడి, కల్పనా సెంటర్,కోకిల సెంటర్,మార్కెట్ రోడ్ తో పాటు కాకినాడ లో చాలా చోట్ల వీదులు, రోడ్లు మోకాళ్ళ లోతులో నీటమునిగాయి. ఈ నీటిలోనుండి వెళ్ళడానికి ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.