కరెంట్ షాక్ తో మహిళ మృతి

0
137

పెద్దవంగర, అక్టోబర్ 27(నవతరం):  విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఎస్కే రియాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గిరగాని ధనమ్మ (50) తన భర్తతో కలిసి తమకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలంతో వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తుంది. దీపావళి నోముల సందర్భంగా ఇంటిని శుద్ధి చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై అపస్మారక స్థితికి వెళ్ళింది. వెంటనే గమనించిన కుటుంబీకులు తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త గిరగాని మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మృతురాలు గిరగాని ధనమ్మ (ఫైల్ ఫోటో)