ఉరితాడు బిగించుకున్న రైతన్న

0
159
  • జిన్నారం మండలం లోని అక్రమ భూ కబ్జాదారులు

జిన్నారం / సంగారెడ్డి, అక్టోబర్ 17 (నవతరం): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఊట్ల గ్రామంలో సర్వే నంబర్ 829, 619, 617, 319, 490 సర్వే నెంబర్ల గల భూములకు సంబంధించి 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన పాస్ బుక్ సర్టిఫికెట్లకు, భూముల యొక్క పొజిషన్ చూపించక పోవడంతో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగిన గ్రామస్తులు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించి, రైతులు ధర్నా నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి ఇచ్చిన భూ పంపిణీ సర్టిఫికెట్లు, హద్దు బంధులు చూపించాలని రెవెన్యూ అధికారుల కోరారు. మరో క్షణం కొంతమంది బడా నాయకులు అట్టి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న తీరుపై నిరసనగా ఎమ్మార్వో కార్యాలయం ముందు ఉరి వేసుకోవడానికి రైతులు ప్రయత్నించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఈ గ్రామంలో 829, 619, 617, 376, 490, 20, 864 సర్వే నంబర్ లలో ఉన్న భూములకు అప్పటి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సర్టిఫికెట్లను, భూముల పొజిషన్ చూపించినా ఎమ్మార్వో హద్దు బందులు చూపెట్టిన సందర్భంగా పాలాభిషేకం చేసి రైతులు ఆనందంతో ఆ భూమిని సాగు చేయడానికి వెళ్లగా కొంతమంది బాడా బాబులు, వాళ్లకు ఎలాంటి పత్రాలు లేకుండా ఆ భూమిపై పెత్తనం చలాయిస్తున్న రాజకీయ నాయకుల అండదండలతో ఆ భూమిని రాత్రికి రాత్రి జెసిబి, హిటాచి లు సహాయంతో సాగు చేస్తున్నారని తెలిసి, అక్కడికి వెళ్లగానే ఆ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆ భూ బకాసురులపై క్రిమినల్ కేసు పెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఊట్ల గ్రామానికి చెందిన మహేష్ ముదిరాజ్, గ్రామానికి చెందిన రైతులు తన తోటి మిత్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీతో ధర్నా చేశారు. మా భూములు మాకు కావాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఊట్ల గ్రామానికి చెందిన రైతులతో కలిసి తన వంతు కృషి చేస్తానని మహేష్ ముధిరాజ్ హామీ ఇచ్చారు. మండలంలోని ఏమార్వో కార్యాలయం ముందు కొంతమంది రైతులు మా భూములు మాకు కావాలని, దానికి మేము చావడానికైనా సిద్దమే అంటూ మండలం ముందు ఉరివేసుకోవటానికి సిద్దమయ్యారు. లేనియెడల అధికారులపై పోరాటం చేయటానికి సిద్దమని రైతులు హెచ్చరించారు.