రైతు సంక్షేమమే మా ధ్యేయం..దువ్వాడ….

0
362


నవతరం, టెక్కలి: నేడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లాట్కర్ ఆధ్వర్యంలో కోట బొమ్మాళి లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక అనే వారని అయితే మారుతున్న ఆ మాటను నిజం చేసేందుకు రైతు బాంధవుడు ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ద్వారా ప్రత్యేక వ్యవస్థకు రూపకల్పన చేశారని రైతులు అన్ని రకాలుగా వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రైతు సలహా మండలి సభ్యులు రామరాజు, కోటబొమ్మాళి రైతు భరోసా సలహా మండలి అధ్యక్షులు V. కృష్ణారావు, కోటబొమ్మళి AMC చైర్మన్ చుక్క గున్నమ్మ, PACS చైర్మన్ బాడాన మురళి, వ్యవసాయ శాఖ అధికారులు J.D, A.D, హార్టికల్చర్ అధికారులు ,VAO లు ఇతర ప్రభుత్వ అధికారులు, రైతులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తదుపరి టెక్కలి మండలం పోలవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.