
విద్యార్థినీలను అభినందించిన చైర్మన్ సుంకర వీరబాబు…
నవతరం, ప్రత్తిపాడు: ఒమ్మంగి ప్రాంతంలోని ఎస్ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మరోసారి తన సత్తా చాటింది. తక్కువ ఫీజులతో అత్యుత్తమ బోధన అందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ఈ కళాశాల,మెరుగైన ఫలితాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది.సీనియర్ ఇంటర్ (ఎంపీసీ) విభాగంలో కర్నీడి మౌనిక 978/1000 మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను పెంచగా, దాడిశెట్టి చంద్రకళ 974/1000 మార్కులతో ప్రతిభ చాటింది. జూనియర్ బైపీసీ విభాగంలో పల్లాటి లాస్య మనస్విని 445/455 మార్కులు సాధించి మెరిసింది.అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో పెట్టిం శివ సాహితి, తేజోమూర్తుల ఉమా గాయత్రి ఇద్దరూ 440/470 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీలను కళాశాల చైర్మన్ సుంకర వీరబాబు, ప్రిన్సిపాల్ రామిశెట్టి బులిరమణ అభినందించారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.స్థానికులు, తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

