

తాగి వాహనం నడిపితే జైలుకే…
సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా..
నవతరం, ప్రత్తిపాడు: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంత్ లక్ష్మి కాంతం తెలిపారు.బుధవారం స్థానిక ఇంద్రమాల్ హాస్పిటల్ సమీపంలో ప్రత్యేక డ్రైవ్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించారు. అలాగే మద్యం తాగి ప్యాసింజర్ ఆటో నడిపిన ఓ డ్రైవర్ 20 మంది ప్రయాణికులతో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపితే జైలు శిక్షతో పాటు రూ.10 వేలు అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరదన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో కానిస్టేబుల్ గోవింద్, మూర్తి తదితరులు ఉన్నారు.

