అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా అరబిందో ఫార్మా లో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు HDFC BANK వారి ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం ను నిర్వహించారు. ఈ శిబిరం లో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు డాక్టర్ పి. సత్యనారాయణ మాట్లాడుతూ రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణదాతలు కావాలని అయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తపు నిల్వలు చాల ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఆ కొరతను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన కోరారు. హెచ్. డి ఎఫ్ సి బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ కె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ కొంతమందికి రక్తదానం పట్ల కొన్ని రకాలైన అపోహలు ఉన్నాయని ఇలాంటి రక్తదాన శిబిరాల వలన అపోహలు తొలగిపోతాయని అన్నారు. అరబిందో ఫార్మా కార్పొరేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ యూ ఎస్ బి రాజు ,శ్రీ కె. కమలాకర్ రెడ్డి మరియు శ్రీ ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్క ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వలన రక్తం శుద్ధి బాగా జరుగుతుందని దాని వలన ఆ వ్యక్తికీ ఎటువంటి ఆరోగ్యసమస్యలు రావని అందువలన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం వలన ఆరోగ్యం పాడవుతుందని అపోహలు ప్రజలలో ఉన్నాయని కానీ నిజానికి రక్తదానం చేయటం వలన చాల ఆరోగ్యంగా ఉంటారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొని రక్తదానం చేసారు.ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బురహన్ సయ్యద్ సమన్వయ కర్త గా వ్యవహరించారు.


