మోడల్ స్కూల్ కేజీవీబీ విద్యార్థులకు ఇబ్బంది కలుగకూడదు

0
174

మెదక్ /టేక్మాల్ (నవతరం): టేక్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కేజీవీబీ,గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కు వెళ్ళేటప్పుడు దారిలో బురద మాయం కవడంతో విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజ భాస్కర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే టేక్మాల్ సర్పంచ్ సుప్రజా స్పందించి విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండ బురద మాయమైన దారిలో మొరం వేసి పక్కనుడి మురికి నీరు వెళ్లేందుకు జేసీబీ ద్వార కాలువను తీయడం జరిగిందని సోమవారం నాడు నవతరం ప్రతినిధి కి తెలిపారు. ఇక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు వుండవని సుప్రజా తెలిపారు.వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజ భాస్కర్ కు విద్యార్థులు, ఉపాద్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.