
నవతరం, శ్రీకాకుళం: జిల్లాలోని కళింగ సామాజిక వర్గానికి తగు స్థాయిలో గుర్తింపు ఇచ్చిన నేతలు దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన తనయుడు వైయస్సార్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు వారి హయాంలోనే తగు ప్రాధాన్యతనిచ్చి గుర్తించినటువంటి నేతల కూడా వారు మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యముగా జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణలో భాగముగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలను తగు విధముగా గుర్తించినటువంటి నేతగా గుర్తించుకోక తప్పదు. దురదృష్టము ఏమోకానీ కొన్ని చరిత్ర కలిగిన నేటి మైనారిటీలు తప్ప అందరికి ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ నైపద్యంలో నేటి కీలక పరిస్థితులలో ముఖ్యముగా నేడున్న పాలకపక్షాల తీరును పరిగణలోకి తీసుకొని అపోహలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు, ఇగోలకు అవకాశం ఇస్తే రానున్న రోజులలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి, మరియు సామాజిక న్యాయానికి సుపరిపాలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి న్యాయం జరిగేందుకు నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ తరుణంలో కులాల కుమ్ములాటలు, మత వాదనలు తెరపైకి తీసుకొస్తూ ఐక్యతను దెబ్బతీసే కొన్ని వర్గాలు, లేక వ్యక్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి భవిష్యత్తు రాజకీయాల కోసం, జిల్లా అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తొలగించగలిగే, అధినేతకు ప్రాధాన్యతను ఇచ్చి, పరిపాలన వికేంద్రీకరణతో సమన్యాయం, సమధర్మం, సామాజిక న్యాయం కోసం అన్న దృక్పథముతో ఆనతి కాలములోనే నిరూపించిన గత ప్రభుత్వం వైయస్సార్సీపి అధినేత జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం. దీనిని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం జిల్లాలోని వైయస్సార్సీపీలోని అన్ని వర్గాలు వారు, మరియు తటస్తులు, గతంలో లబ్ది పొంది న్యాయం జరిగిందన్న మనస్సాక్షి కలిగిన వారు, సమాజ హితం కోరే తత్వము గల వారు, అందరూ నేడు ఆలోచించవలసిన తరుణమని చెప్పలి, రానున్న రోజులలో తీసుకోవలసిన ఖచ్చితమైన నిర్ణయాలే భవిష్యత్తు జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే విధంగా ఉంటాయని చెప్పుటకు అతిశయోక్తి లేదు. ఆశిద్దాం శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, సుపరిపాలనకు, అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే విధంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రజల నిర్ణయాలు ఉంటాయని, అదేవిధంగా ఈ తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న నేడు ఉన్న అన్ని వర్గాల నాయకులు శ్రేణులు ఐకమత్యంతో వర్గ భేదములు విడి సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడే విధముగా ప్రయత్నిస్తారని…ఆశిద్దాం.

