దేశంలో శ్మశానం లేని గ్రామంటే గుర్తొచ్చేది… సత్య దేవుని అన్నవరమే.

0
766

ఈ వైఫల్యానికి కారణం ఎవ్వరు…

ప్రసిద్ధి ఆధ్యాత్మిక వైష్ణవ క్షేత్రం…..!.. అన్నవరం…. జాతీయ రహదారి ఆనుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రత్నగిరిలలో వెలసిన విష్ణుమూర్తి అంశం శ్రీశ్రీశ్రీ వీర వెంకట వరాహ సత్యనారాయణ స్వామి…..!… హిందూ సంప్రదాయంలో వివాహము గృహప్రవేశం తదితర శుభ కార్యక్రమాల తరువాత గృహ శాంతి కోసం చేసే వ్రతం శ్రీ శ్రీ సత్యనారాయణ వ్రతం….!… ప్రశాంతతకు మారుపేరు శ్రీ సత్యనారాయణ స్వామి…..!… ఇటువంటి మహా క్షేత్ర స్వామివారి పాదాలు చెంత, గిరుల కిందనున్న నగర పంచాయతీకి శాశ్వత చివరి మజిలీలో దేవుని సన్నిధికి చేరిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటిక లేకపోవడం ఆశ్చర్యం…….!…

నవతరం, అన్నవరం: సుమారు 15 వేల జనాభా కలిగి అనునిత్యం జాతీయ స్థాయిలో భక్తుల తాకిడి ఉన్నటువంటి దేవాలయం దేవాలయం కిందనే ఉన్నటువంటి నగర పంచాయతీ అన్నవరం……!… అటువంటి చోట అన్ని వసతులతో చివరి మజిలీలు దేవుని సన్నిధికి చేరుకునేందుకు శ్వాస విడిచిన జీవులు సాగనంపే, మట్టిలో కలిపే క్రియ అంత్యక్రియలు రుద్రభూమిలో వాటిని పద్ధతి ప్రకారము నిర్వహించేందుకు శ్మశాన వాటిక అవసరం. అయితే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం అన్నవరంలో నేటికీ హిందువులకు శ్మశాన వాటిక లేదు. అందుకు ఏర్పాట్లు కూడా నేటికీ లేకపోవడం ఆందోళనకరం, ఎవ్వరైనా దేవుడి చెంతకు చేరితే వారి అంత్యక్రియలకు అన్నవరానికి 35 కిలోమీటర్ల దూరంలో నున్న పురుహూతికా శక్తి పీఠం వెలసిన నగర పంచాయతీ పిఠాపురంలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకేళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పాలకుల వైఫల్యం, అది కూడా స్థానికంగా దశాబ్దాలుగా నున్న ప్రముఖ రాజకీయ వ్యక్తులు సొంత ప్రాంతం కూడా ఇంతటి నిర్లక్ష్యం వెనుక కారణాలు ఏమైనప్పటికీ ఇది మాత్రం ఆశ్చర్యాన్ని, ఆందోళన, ఆవేదనను గురిచేసే అంశము అని చెప్పుటకు అతిశయోక్తి లేదు. ప్రతీ గ్రామంలో శ్మశానం ఏర్పాటు చెయ్యవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేదనే చెప్పాలి. ఈ ప్రాంత వాసులతో పాటు అనునిత్యం దైవ దర్శనానికి వస్తున్న యాత్రికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.