ఖరీఫ్‌కు సిద్ధం కావాలి, నాణ్యమైన విత్తనాలే సరఫరా చేయాలి…

0
8

డీలర్లకు ఏవో జోకా అమృత హెచ్చరిక… అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు…


నవతరం, ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం ఏవో జోకా అమృత ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ జి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్‌కు రైతులకు కేవలం నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచాలని డీలర్లకు స్పష్టంగా ఆదేశించారు.ఎరువులు అధిక ధరలకు విక్రయించినట్లయితే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యాపారాలు నిర్వహించాలని, ఎరువులు ఓ ఫారమ్స్ పూర్తి చేసిన తరువాతే రైతులకు విక్రయించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here