
నవతరం, శంఖవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని కత్తిపూడిలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి వెన్నా శివ భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వెన్నా శివ మాట్లాడుతూ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లే దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబుకు దీర్ఘాయుస్సు,మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాబు కృష్ణమూర్తి, కేళంగి జన, సాదనాల లక్ష్మిబాబు, కంచిబోయిన శ్రీను, రౌతు శివ, గాబు శివ, జ్యోతుల శివ తదితరులు పాల్గొన్నారు.

