కాంగ్రెస్ 137 వ ఆవిర్భావ దినోత్సవం ….

0
264

భారత జాతీయ కాంగ్రెస్ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎ. పి. సి. సి. మెంబెర్ శ్రీ ధర్నాల కోట శ్రీను గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జి శ్రీ ఉమ్మిడి వెంకటరావు పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం S.C. సెల్ అధ్యక్షులు శ్రీ. మోయ్యేటి సూర్యప్రకాశరావు, ప్రత్తిపాడు నియోజకవర్గం B. C. సెల్ అధ్యక్షులు శ్రీ. కొల్లు వీరగణేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ. కోప్పన కోటేశ్వరరావు, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు శ్రీ. దంతులూరి రమేష్ రాజు, శక్తీ కో-ఆర్డినేటర్ శ్రీ. ఉమ్మిడి సురేష్, ప్రత్తిపాడు గ్రామ అధ్యక్షులు శ్రీ. దాసరి సత్తిబాబు, ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ. కందిమల్ల శామ్యూల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.