- మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మేడ్చల్ జిల్లా బ్యూరో, అక్టోబర్ 17 (నవతరం): మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో సమావేశమై కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి కాసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డుల ఇంచార్జ్ లు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


