
మరో భారీ ఉద్యమానికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ…
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే.. దేశవ్యాప్త నిరసనలకు తెరతీస్తామని అభిజీత్ దీప్కే అల్టిమేటం…
భారత దేశ ప్రజాస్వామ్యానికి సీఈసీ అతిపెద్ద ముప్పుగా మారారని.. తక్షణమే ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన దీప్కే…
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా.. తాము వెనక్కు తగ్గమని తేల్చి చెప్పిన సీజేపీ అధ్యక్షుడు…
నవతరం, న్యుఢిల్లీ: ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. అలాంటిది 2014 తరువాత దేశంలో ప్రభుత్వం తీరు మారుతూ వచ్చి చివరకు మేం చెప్పింది వినాలి. లేదంటే లోపలేస్తాం అనే పందాకు ప్రభుత్వం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తేనే మనం గెలిచాం అన్నది ప్రభుత్వాలు మర్చిపోయాయి. ఓ దశలో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా అధికార పక్షానికి తలొగ్గే స్థితికి దిగజారవలస్సి వచ్చిందనే చెప్పాలి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీని సైతం జైలుకు పంపాలని చూసింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది జరిగింది. ఆస్థాయిలో దేశంలో ప్రజలను, రాజకీయ పార్టీలను సైతం అధికార పక్షం భయపెట్టిందనే చెప్పాలి. ఇందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఉన్న కొందరు న్యాయమూర్తులు వత్తాసు పలికారు. న్యాయమూర్తులు కూడా వారి స్థాయిని, హోదాను మర్చి రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి దిగజారి మాట్లాడిన సందర్బం చూశాం. ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి దేవుడు ఉన్నాడని పురాణాల్లో చెప్పిన్నట్లు సుఫ్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి దేశంలో ప్రశ్నిస్తున్న యువతను బొద్దింకలతో పోల్చడం వలన యువత ఆగ్రహానికి గురై దేశ విదేశాల్లో ఉన్న యువత మేం బొంద్దింకలమే అంటూ సోషల్ మీడియాలో బొద్దింక (కాక్రోచ్) పార్టీ స్థాపించి గంటల వ్యవధిలో కోట్ల మంది అబిమానులను సంపాదించుకుంది. వారందరూ ఆపార్టీకి కార్యకర్తలుగా తయారయారు. అక్కడితో ఆగకుండా అధికార పార్టీని వారి డిమాండ్లకు తలొగ్గేలా చేశారు. చివరకు ఒక మంత్రితో రాజీనామా చేయించారు. 12 ఏళ్ళుగా మాకు తిరుగులేదని అనుకుంటున్న ప్రధాని, హోం మంత్రులకు కూడా ఒక్కసారిగా ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందని గుర్తుచేశారు. ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉందని దేశ ప్రజలకు గుర్తుచేశారు. అంతే కాకుండా దేశ ప్రజలకు మూసుకుపోయిన కళ్ళు తెరిపించారు. నేడు దేశంలో నియతృత్వ పాలనకు కారణమైనా ఎన్నికల సంఘం ప్రధానాధికారిని రాజీనామా చెయ్యాలని అతని వల్లే దేశంలో ఈ పరిస్థితి ఏర్పడిందని 48 గంటల సమయంలో రాజీనామా సమర్పించకపోతే దేశంలో యువత ఉధ్యమం చేస్తారని కాక్రోచ్ (బొద్దింకలు) జనతా పార్టీ అధ్యక్షుడు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. పాలకులు గెలిచిన తరువాత ప్రజలను పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో దాదాపు 12 ఏళ్ళ తరువాత దేశంలో యువత గుర్తు చేశారు. ఇంత కాలం ప్రతిపక్షాలు చేయలేని పనిని వారు చేసి చూపించినందుకు ప్రజలు వారిని అభినందిస్తున్నారు. మరికొందరైతే కమ్యూనిస్టులు బలహీనత ద్వారా ఏర్పడిన కాలిని పూరించేందుకు దేవుడు వారిని వరముగా ఇచ్చాడా అని గుర్తుచేస్తుకుంటున్నారు. ఈ నైపద్యంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం అనివర్యమైన సమయములో పేరు ఏదైనా మీరు మాత్రం ప్రజాస్వామ్య రక్షకులే అని ప్రజాస్వామ్యవాదులు. మేధావులు అభిప్రాయపడుతున్నారు.

