గ్రామంలో పెద్ద పులి సంచారం….

0
271

గెదెలను వెంటాడి చంపుతున్న పెద్ద పులి…

నవతరం, ప్రత్తిపాడు: గత నెల రోజులుగా గుర్తు తెలియని జంతువు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో గెదెలను చంపి తిన్నది. ఒక్క ఒమ్మంగి గ్రామంలో నాలుగు గెదెలను చంపి తినేసిన ఘటన టీవి, పేపరు, సామాజిక మాధ్యమాల్లో చూశాము. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం ఎలా చనిపోతున్నాయి, ఏ జంతువు తినేస్తుంది గుర్తించకపోవడంతో చుట్టుపక్కల గ్రామంల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం రావడం, చూడడం, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే ఈ రోజు పోతులూరు గ్రామ పంట పోలాలలో ఒమ్మంగి గ్రామానికి చెందిన కందా కామరాజు గారి కుమారుడు పాపయ్య గేదెని నిన్న అనగా 26/5 న సాయంకాలం 5 గంటల సమయంలో గేదెపై దాడి చేసినట్లుగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అది ఈరోజు ఉదయాన్నే రైతులు పొలం పనులకు వెలుతుండగా చనిపోయిన గేదెను చూసిన రైతులు భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు. వారు చూసింది కొంతమందికి చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటు వంటి పంజా ముద్రలు చూసి పులి పంజా లా ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. పులి మరలా అక్కడకు వస్తాదనే అనుమానంతో 15 కెమెరాలు అమర్చడం జరిగింది. అటవీశాఖ అధికారులు మాత్రం పులి కదలికలు తెలుసుకునే వరకూ రెండు మూడురోజులు గస్తీ నిర్వహిస్తామని జిల్లా అటవి అధికారి తెలిపారు. గ్రామస్తులు ఎవ్వరూ కొన్ని రోజుల పాటు చీకటి పడితే అత్యవసరం అయితే తప్ప వంటరిగా బయట తిరగొద్దని తెలిపారు. గ్రామ ప్రజలు మాత్రం ఇన్ని రోజుల నుంచి పులి యధేచ్చగా తిరుగుతుంటే అధికారులు పులిని పట్టించుకోక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అటవీశాఖ అధికారులు ఆలసత్వం వహిస్తున్నారు కాబట్టే పులిని పట్టుకోలేదనే అనుమానం వ్యక్తమవుతోంది. జంతువులు ప్రాణాలే కదా అనే అభిప్రాయంలో అటవీశాఖ అధికారులు ఉన్నట్లు కనిపిస్తుంది. అదే గ్రామంలో ప్రవేశిస్తే అనే మాట ఊహించడానికే భయంగా ఉదంటూ గ్రామ ప్రజలు భయపడుతున్నారు. పోతులూరు గ్రామ ప్రజలు మాత్రం భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మేలుకోని పులిని పట్టుకుంటే చుట్టుపక్కల గ్రామంల్లో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర మృగాలు గ్రామాల్లోకి అడుగు పెట్టకుండా చూడాల్సిన అధికారులు గ్రామాల్లో విచ్చలవిడిగా పెద్ద పులి నెల రోజులుగా తిరుగుతుంటే అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవరించడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పులిని పట్టుకుని అడవిలో వదిలిపెడితే చుట్టుపక్కల గ్రామంల్లో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. పులిని కదలికలు తెలుసుకోవడం కొరకు కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఐ.కే.వి రాజుతో పాటు సబ్ డి.ఎఫ్.వో టి.పి సౌజన్య ఏలేశ్వరం, వైల్డ్ లైఫ్ డి.ఎఫ్.వో సెల్వం రాజమండ్రి, ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారిని భరణి, ఎఫ్.ఆర్వో ఏలేశ్వరం, టి.అర్వో ఏలేశ్వరం, డి.ఆర్వో రామకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.