
నవతరం, పలాస: ఏ మహిళకు అన్యాయం జరిగినా గన్ కంటే ముందు జగన్ ఉంటారు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
మీ తండ్రి హయాంలో పిడికి ఎక్కడికి పోయింది.
మహిళలపై గత దాడులు గుర్తు లేవా లోకేష్.
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా గన్ కంటే ముందు జగన్ అన్న ఉంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.మంగళవారం పలాసలో మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో రమ్య హత్య ఘటన అందరికి తెలిసిందే నడి రోడ్డు మీద పైశాచికత్వంగా హత్య చేసిన వ్యక్తిని కొద్ది గంటలలోనే పోలీసులు పట్టుకున్నారు. దిశా చట్టం క్రింద కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు. జరిగిన ఘటన తెలుసుకుని వెంటనే రాష్ట్ర పోలీసు శాఖకు ఖచ్చితమైన ఆదేశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి జారీచేశారని అన్నారు. ప్రతిపక్ష నేతలకు ఏమిచేయాలో తెలియని ఆలోచనలో ఆందోళనలో ఉన్నారని అందుకు నిన్నటి ఘటన సాక్ష్యం అని అన్నారు. నిన్నను రాష్ట్రంలో నాడు నేడు ద్వారా బాగు పడిన బడులను మొదటి దశగా ప్రారంభం చేసుకునే పనిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలలోకి వెల్లకుండా చేయడానికి ప్రజల దృష్టిని మార్చడాని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఒక ప్రణాళికలో భాగమే నిన్నటి ఘటన అని అన్నారు. పరామర్శల పేరుతో ప్రేరిపిత చర్యలకు పాల్పడటం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చరెస్తున్న పనులుగానే కనిపించాయని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు భద్రతా, భరోసా ఇచ్చేందుకు దిశా చట్టం తీసుకు వచ్చిన ఘనత మన సీఎం ది అని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి అప్పుడు మీ తండ్రిపై నీవు ఎందుకు పిడికిలి బిగించలేదని ప్రశ్నించారు. లోకేష్ పిడికిలి బిగిస్తే జడిసేది ఎవరు లేరని అన్నారు. మీ మనుగడ కోసం మీరు పిడికిలి బిగించుకోవడమే తప్ప ప్రజలకు ప్రయోజనం చేసేందుకు మీరు ఏ పని చేయలేరని ప్రజలకు అర్ధం అయ్యిందని అన్నారు. మృతదేహం దగ్గర బాదను వ్యక్తం చేయాలే కానీ ప్రభుత్వం పై ఉద్దేశ పూర్వకంగా అసభ్యకర పదజాలంతో మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అనేది లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. మహిళలకు రక్షణగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని అందుకే రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక అన్నగా ఈ రోజు ఆదరణ పొందుతున్నారని అన్నారు. వాస్తవాలను ప్రక్కన పెట్టి రమ్య విషయంలో ప్రభుత్వం పై బురద జల్లేందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని సంఘట జరిగిన కొన్ని గంటలలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆ విషయం ప్రతిపక్ష పార్టీ నాయకులు లోకేష్ గుర్తించాలని కోరారు.

