శ్రీకాకుళంః శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకూర్మాం మేజరపంచాయితీ పరిధిలోని చీడిపేట గ్రామానికి చాలా ఏళ్లు కనీసం రహదారి లేక అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే టీడీపీ హయాంలో గుండ లక్ష్మీదేవి చొరవ చూపి ఆ గ్రామానికి మట్టి రోడ్డు వేయగలిగారు.అయితే ఆ రోడ్డు వేసి మూడేళ్లుకు పైగా కావడంతో రోడ్డుంతా గుంతలుగా మారిపోయింది. వాన కాలంలో ట్రాక్టర్లు ఎక్కువగా తిరగడంతో గోతులమయం అయ్యింది. అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని అక్కడ స్ధానికులు కోరుతున్నారు. రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గం కావడంతో ఆయన సొంత నియోజకవర్గం లోని ఆ గ్రామ ప్రజలు సీసీ రోడ్డు కోసం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా తమ గ్రామానికి సంబందించి స్మశాన వాటికకు కూడా దారి లేదని, ఆ దారి సదుపాయం కల్పించాలని స్ధానికులు కోరుతున్నారు.


