అది టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా చివరికి బాలీవుడ్ అయినా శ్రీదేవి సహనటులంతా ఎంతో సఖ్యతగా ఉండేవారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీదేవిని అంతా ఇష్టపడేవారు. ఆమెకి ఎవరితో ఇబ్బందిలేదు. ఆమెతో ఎవరికీ ఎప్పుడూ ఏ ఇబ్బందీ కలగలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఖల్‌నాయక్‌తో ఆమెకో చేదు అనుభవం ఎదురైంది.
దాదాపు 35 ఏళ్లక్రితం జరిగిందీ సంఘటన. 1983లో హిందీ సినిమా ‘హిమ్మత్‌వాలా’ సినిమా షూటింగ్ సమయంలో హీరో సంజయ్‌దత్ తీరుతో శ్రీదేవి హడలిపోయింది. శ్రీదేవి ఉంటున్న హోటల్ గదికి చెప్పాపెట్టకుండా వచ్చేశాడు ఖల్‌నాయక్. సంజయ్‌దత్ గట్టిగా తలుపులు బాదడంతో చేసేదేం లేక డోర్ తెరిచింది శ్రీదేవి. ఆ సమయంలో సంజయ్‌దత్ ఫుల్‌గా మందుకొట్టేసి ఉండటంతో భయపడిపోయింది.
శ్రీదేవి ‘హిమ్మత్‌వాలా’ సినిమాలో హీరో జితేంద్రతో కలిసి నటిస్తున్న విషయం తెలిసి సంజయ్‌దత్ ఆమెని కలుసుకునేందుకు వచ్చాడు. గదిలోకి తూలుతూ వచ్చిన సంజయ్‌దత్‌ని ఎలాగోలా సముదాయించి బయటికి పంపించేసింది శ్రీదేవి. ఆ తరువాత ఇక ఎప్పటికీ సంజయ్‌దత్‌తో కలిసి నటించకూడదని ఫిక్సయిపోయింది శ్రీదేవి.

