వంద‌నం..అభివంద‌నం..

0
728

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే ఏ హీరోయిన్‌కీ లేని రికార్డుని సొంతం చేసుకుంది అందాల తార శ్రీదేవి. బాల‌న‌టిగా మెప్పించి, ఏ హీరోలకు కూతురిగా, మ‌న‌వ‌రాలిగా న‌టించిందో…వారి స‌ర‌స‌నే హీరోయిన్‌గా అల‌రించింది.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి టాప్ హీరోల సిన్మాల్లో న‌టించింది శ్రీదేవి. బడిపంతులు సిన్మాలో న‌ట‌ర‌త్న ఎన్టీఆర్‌కి మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆయనతో హీరోయిన్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ సిన్మాలు చేసింది. ఏ హీరోయిన్‌కీ ఇలాంటి అరుదైన రికార్డు సాధ్యం కాలేదు.

ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్‌లో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికీ మ‌రిచిపోలేని బ్లాక్‌బస్టర్స్ ఎన్నో . వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి వంటి సినిమాలు వీరిద్ద‌రి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లుగా నిలిచాయి.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ, కృష్ణంరాజుకు కూతురుగా నటించిన శ్రీదేవి..అదే హీరోల సరసన హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఏఎన్నార్‌-శ్రీదేవి కాంబినేషన్‌లో ముద్దుల కొడుకు సినిమా వచ్చింది. తర్వాత ముద్దుల మొగుడు, శ్రీరంగనీతులు, బంగారు కానుక, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, సత్యం శివం సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రేమాభిషేకం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.