విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జయంతోత్సవాలు….

0
334


నవతరం: ఆంధ్రభోజులు, కళాపోషకులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జయంతోత్సవాలు భీమవరంలో స్థానిక శ్రీ వెంకట్రామా థియేటర్ హాల్లో నిర్వహించి ,పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసే కార్యక్రమం చిరు పవన్ తేజం సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.
చిరు పవన్ తేజం సేవా సమితి అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అధ్యక్షత వహించి స్వచ్ఛ పరిపాలనతో ,పేద వర్గాల వారికి నిరంతరం సేవలందిస్తూ, లలిత కళలు ,సాహిత్యం పై విశేష సేవలందించి ,భారతదేశ చరిత్రలో ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి అని అన్నారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందమూరి రాజేష్, అంకాల ఆర్ట్స్ అకాడమీ సభ్యులు పరిమి రామకృష్ణ, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి,లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, దళిత నాయకులు గంటా సుందర్ కుమార్, కరుణాకర్ తదితరులు శ్రీకృష్ణదేవరాయల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు, అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.