
నవతరం, రావులపాలెం: వయసు మీద పడింది. దానికి తోడు మతిస్థిమితం కోల్పోయాడు. చివరి వరకు తోడుగా నిలిచే భార్య మధ్యలో మృతి చెందింది. చేరదీయవాల్సిన ఇద్దరు పిల్లలుండి ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుంటి చాకుతో తప్పించుకున్నారు. దాంతో ఆకలి,దప్పిక తెలియని ఆ మతిలేని వృద్ధుడు ఎవరైనా దయతో తెచ్చి పెట్టిన అన్నం, నీళ్ళు తాగి ఒకేచోట రెండేళ్లుగా కాలం వెళ్లదీస్తూ నిర్జీవంగా గడుపుతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రావులపాలెం ఎస్సై భాను ప్రసాద్ ఈ సంఘటన పై చలించిపోయారు. స్థానికుల సహాయంతో అతన్ని మనిషిగా తీర్చిదిద్ధి, ఓ అనాధ ఆశ్రమంలో చేర్పించి తన మానవత్వాని చాటుకొని అందరి చేత శభాష్ అని శాల్యూట్ చేయించుకున్నారు. ఈ హృదయ విధారకర సంఘటన రావులపాలెం లో చోటు చేసుకుంది. రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంకు చెందిన కొవ్వెల వెంకటరమణ వయసు మెడపడింది. అతను గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ఇటీవలే భార్యా మృతి చెందింది.

మొదటి వేవ్ కరోనాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మతిస్థిమితం లేని వ్యక్తిని రావులపాలెం పోలీసు స్టేషన్ సమీపంలోని వీధిలో వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఒక అరుగుపై బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తూ, ఆ వీధిలో ఉంటున్న స్థానికులు పెట్టింది తిని, నీళ్ళు ఇస్తే తాగేవాడు. అయితే ఇటివల ఆ ప్రాంతం అంతా దుర్భరమైన దుర్వా వాసన వస్తుండడంతో స్ధానికులు స్థానికులు పంచాయతీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రావులపాలెం ఎస్సై భాను ప్రసాద్ మతిస్థిమితం లేని వ్యక్తి బంధువులను సంప్రదించారు. తీసుకువెళ్లడానికి వారు తిరస్కరించారు. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చూసుకునే స్తోమత లేదని తేల్చి చెప్పారు.
వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎస్సై భాను ప్రసాద్ సచివాలయం మహిళా పోలీస్ లక్ష్మి బృందావనం, స్థానిక పారా సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్, పోతుమూడి శేషారత్నం, వాలంటీర్ కర్రి భవానీల సహాయం తీసుకున్నారు. అతన్ని శుభ్రపర్చి గుంటూరు దగ్గర పొన్నూరులో గల ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించారు. వీరు చూపిన మానవత్వానికి, ముఖంగా రావులపాలెం ఎస్సై భాను ప్రసాద్,పారా డైరెక్టర్ అనిల్ కుమార్, పోతుమూడి శేషా రత్నం లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
—–భోగిశెట్టి నాగేశ్వరరావు.
రావులపాలెం.

