కన్నుకొట్టి కశ్మీర్ టూ కన్యాకుమారి కోట్లమందిని పడేసింది. నాజూకైన వేళ్లని ఎక్కుపెట్టి గుండెల్లో తియ్యటి తూటాలు దించింది. ఒక్క సీన్‌తో విపరీతమైన పాపులారిటీ తెచ్చేసుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. జనాల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ప్రతీ హీరోయిన్ ప్లాన్ చేస్తుంది. కానీ ప్రియా ప్రకాష్ మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది. కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
‘ఒరు అదార్ లవ్’ టీజర్ మత్తులో ఊగిపోతున్న సినీజనం ప్రియాప్రకాష్‌తో సిన్మాలు చేయడానికి క్యూ కడుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మందిఈ బ్యూటీకొచ్చిన క్రేజ్‌ను బాక్సాఫీస్ బొనాంజాగా మార్చుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇప్పుడే ఏ సినిమాకూ సైన్ చెయ్యనంటోంది. కారణం..‘ఒరు అదార్ లవ్’ సినిమానే. తనను ఓవర్ నైట్ స్టార్‌ని చేసిన ఈ మూవీయే ప్రియా కెరీర్‌కు బ్రేకులేస్తోంది.

మొదట ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాప్రకాష్‌ని ఓ చిన్న రోల్‌కే తీసుకున్నాడు దర్శకుడు ఒమర్ లులు. అయితే వాలెంటైన్స్ డే టీజర్‌లో ప్రియా ఓర చూపులకు ఫ్లాటైన యూత్‌ని శాటిస్‌ఫై చెయ్యడానికి ఈ బ్యూటీ కేరక్టర్ లెంగ్త్ పెంచేశారని సమాచారం. రీ-షూటింగ్‌తో సినిమా ముందు అనుకున్న జూన్ 14 నుంచి ఆగస్ట్‌కు వాయిదా పడింది. దీంతో ‘ఒరు అదార్ లవ్’ పూర్తయ్యేదాకా ఏ స్టోరీనీ వినేది లేదంటోంది ప్రియా ప్రకాశ్.
కన్నుకొట్టి ఎంతోమందిని ఊహల్లో విహరింపజేయడమే కాకుండా కొందరికి కోపం కూడా తెప్పించింది ప్రియాప్రకాష్. ముస్లిం మత విశ్వాసాల్ని దెబ్బతీసేలా పాట ఉందనే కేసులతో ప్రియా సుప్రీంని ఆశ్రయించింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టీజర్ ఆధారంగా ప్రియపై, దర్శకుడిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.


