
భద్రాద్రి జిల్లా బ్యూరో, అక్టోబర్ 17 (నవతరం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు నుంచి ఖమ్మం వైపు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలను సోమవారం పాల్వంచ పట్టణ పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
