- భద్రాచలం నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్
చర్ల, డిసెంబర్ 09 (నవతరం): గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏడు పర్యాయాలు వరుసగా గెలిచి అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించిన సందర్భంగా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలంలో మండల అధ్యక్షులు నక్కా కన్నారావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్లలో మిఠాయిలు పంచి విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్ మాట్లాడుతూ దేశంలో మోడీ అందిస్తున్న సుపరిపాలన, అవినీతి రహిత పాలనకు ఈ విజయం నిదర్శనం అని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బిజెపి విజయాన్ని ఆపలేకపోయాయని, గతంలో బిజెపి ఎక్కడ అని అడిగిన వారు ఈ విజయ సునామీలో కొట్టుకుపోయారని అన్నారు. బిజెపి సాధించిన ఈ అఖండ విజయంతో తెలంగాణాలో బిఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, మోదీ జి20 ప్రపంచ దేశాలకు అధ్యక్షుడిగా వ్యవహరించడం దేశానికి గర్వకారణం అని, వారి నిబద్దతకు నిదర్శనం అని అన్నారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చేరే విధంగా అవినీతి లేని పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ఈ విజయ స్ఫూర్తితో, ఉత్సాహంతో పనిచేసి రాస్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అవినీతి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు సంతపురి సురేష్, మండల ప్రధాన కార్యదర్శిలు పొగాకు పూర్ణచంద్, ఉపాధ్యక్షులు ముత్తారం రత్తయ్య, కార్యదర్సులు ఆలెం సమ్మయ్య, కొండేటి చంద్ర శేఖర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సాధన లోకనాథం, గొంది ముయ్యన్న, కొర్స సురేశ్, మైనార్టీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్డి యాకుబుద్దీన్, ఎస్డి మైనుద్దీన్, కుర గుత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


