మేడ్చల్ జిల్లా బ్యూరో, నవంబర్ 16 (నవతరం): గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మైసమ్మనగర్ బ్లాక్ -బీ నూతన కార్యవర్గ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ ని కోరి సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి ఆంజనేయులు, బండారి రవీందర్ రెడ్డి, కోశాధికారి సంతోష్, సభ్యులు బస్వప్ప, నాగేశ్వర్ రావు, గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున, ప్రభు, ప్రేమ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.


















