ఎగ్జిబిటర్లా….మజాకా…!

0
500



సర్కారు మాట ససేమిరా.–యధావిధిగా కొనసాగిన బెనిఫిట్ షోలు….

ప్రేక్షకుల నిలువ దోపిడీ….


నవతరం, రావులపాలెం. ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే టికెట్ అమ్మాలి.అదీ ఆన్ లైన్ లో అమ్మాలి.ఎగ్జిబిటర్లు ఇష్టం వచ్చినట్లు బెన్ పిట్ షోలు వేయడానికి వీలేదు. బెన్ పిట్ షోలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు లేవంటూ ప్రభుత్వం బ్రేక్ వేసింది. అలాగే రోజుకు నాలుగు షోలు మించకూడదని తెగేసి చెప్పింది. ఆమేరకు సినీఆటోగ్రపీ చట్టం సవరణ చేసి ఉభయసభల్లో ఆమోదించింది. దాంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు గుండెల్లో గుబులు రేపింది. దీనిపై కొన్ని ప్రభుత్వ వ్యతిరేక మీడియా సంస్థలు గగ్గోలు పెట్టాయి.తెగబాధ పడిపోయాయి.తీరా చూస్తే, ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా పాటించ లేదు. సవరించిన చట్టం అమలు కాలేదు. యధావిధిగా బెనిఫిట్ షోలు కొనసాగాయి. టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచి అమ్మారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు షోలను వేశారు. అధికారులు ఎక్కడా అటువైపు కన్నెత్తి చూడలేదు. గురువారం ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య నటించిన”అఖండ”సినిమా విడుదలైంది. యధావిధిగా తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేశారు. టిక్కెట్ రేట్లను ఇష్టానుసారంగా పెంచి అమ్మారు. అమలాపురం వంటి పట్టణాల్లో రూ.500లు నుంచి వెయ్యి రూపాయల కు అమ్మితే, రావులపాలెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో రూ.300లు నుంచి రూ.500లకు అమ్మారని ప్రేక్షకులకు ఆరోపించారు. ఆన్ లైన్ విధానం ఎక్కడా అమలు జరగలేదని పలువురు ఆరోపించారు. ప్రేక్షకులను దీయటర్ యజమానులు ఇష్టానుసారంగా దోపిడీ చేసినా అటువైపు కన్నెత్తి చూసిన అధికారి ఒక్కరు కూడా లేరని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదరబాధర చట్టం చేసి, చట్టసభల్లో ఆమోదించినా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆవేశం గా ప్రభుత్వం తను ప్రవేశ పెట్టిన చట్టాన్ని తానే అమలుచేయకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

నవతరం, రావులపాలెం. భోగిశెట్టి నాగేశ్వరరావు.