మునుగోడు, అక్టోబర్ 17 (నవతరం): మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన స్థానిక, కుత్బుల్లాపూర్ ఇంఛార్జిలతో సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలవాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ, కారు గుర్తుకే ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు.


