అధికారులతో ఎమ్మెల్యే గ్రంథి సమీక్ష…

0
304

తాసిల్దార్ ,హౌసింగ్ డిఇ లతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…


నవతరం, భీమవరం: గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి.. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కోటి గా నెరవేరుస్తున్న మాట తెలిసిందే ఈ నవరత్నలలో ఒకటైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ళు ఉండాలని ఉద్దేశం తో ప్రారంభించి శాశ్వత గృహ హక్కు పధకం మొదలై మొదటి విడత పనులు సకసకా జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఇంకా వేగంగా పూర్తయేలా చూడాలని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వీరవాసరం మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, పట్టాలను అందించామని, లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచించారు .ఈ మేరకు సోమవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో తాసిల్దార్ మేడిది సుందర్రాజు, హౌసింగ్ డి ఈ వెంకటరమణలతో గృహ నిర్మాణంపై సమీక్ష జరిపారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వీరవాసరం మండలంలో 1924 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఒక్కొక్క ఇంటికి రూ లక్ష 80వేల నిధులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు సొంతింటికి యజమాని కావాలని కోరారు. ఇప్పటికే కొన్ని లే అవుట్లను ఇంటి నిర్మాణానికి సిద్ధం చేయడం జరిగిందని, మిగిలిన లే అవుట్ల కు దాళ్వా కోతలు అనంతరం పూడిక పనులు చేపడతామని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో అన్ని మౌలిక వసతులను లబ్ధిదారులకు కల్పిస్తున్నామని అన్నారు. కాబట్టి లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు ముందుకురావాలని కోరారు.