అకాల వర్షాల వలన తడిచిన ధాన్యం పరిశీలించిన amc మాజీ చైర్మన్, టీడీపి రాష్ట్ర కార్యదర్శి…

0
305


నవతరం, నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు వలన ధాన్యం రైతులు, ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా పరిస్థితి పై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన amc మాజీ చైర్మన్, టీడీపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు. చిన అమిరం, రాయలం, కొమరాడ, అనాకోడేరు తదితర గ్రామాల ఆయకట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కళ్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించగా సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం కారణంగా ధాన్యం తడిసి రైతులు ఆందోళనలో చెందుతున్నారని ఈ ధాన్యాన్ని తక్షణమే ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని మీడియా ముఖంగా కోరారు. రాత్రి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కారణంగా ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని దీనిపై ప్రభుత్వం, విద్యుత్ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు మరింత నష్ట పోకుండా కాపాడాలని కోరారు. ఈ పరిశీలనలో రైతులు మల్లుల శ్రీధర్, గూడపాటి బాబూరావు, ముసలయ్య, అత్యుత రామయ్య, నాయుడు, మెల్ల రాము తదితరులు వారు పాల్గొన్నారు.