
ఇల్లు నిర్మాణం చేయకుండా అడ్డుపడుతున్న బృందావనం సుధాకర్ న్యాయం చేయాలంటూ కోటూరి లక్ష్మి ఆవేదన…
నవతరం, ఆత్రేయపురం: ఇల్లు నిర్మాణం పనులు చేపట్టకుండా బృందావనం సుధాకర్ బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కోటూరి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాలు ప్రకారం తనది నిరుపేద కుటుంబం అని తండ్రి మంతాల సుబ్బయ్య, తల్లి సుబ్బమ్మ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ, తిని తినక రూపాయి పోగేసి ర్యాలీ శివారు బుల్లయ్య రేవు నూతనంగా ఏర్పాటు చేసిన లేఔట్ లో మూడు సెంట్లు స్థలాన్ని కొనుక్కున్నానని ఆమె తెలిపింది. అదే స్థలం పక్కన సుధాకర్ స్థలం ఉంది. ఆ స్థలంలో గేదెల ఫారం నిర్వహిస్తూ, పక్కనే ఉన్న స్థలాన్ని తక్కువ రేటుకు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని, లక్ష్మీ స్థలాన్ని అడగగా తను అమ్మకపోవడంతో వివిధ కారణాలతో భయభ్రాంతులకు గురి చేశాడని ఆమె వివరించింది. అయితే ఇల్లు నిర్మాణ పనులను చేపట్టడానికి స్థలంలో పనులు ప్రారంభించగా, బృందావనం సుధాకర్ అడ్డుపడుతూ, పక్కనే ఉన్న ఇంటి స్థలం ఇచ్చేయాలంటూ తనని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని లక్ష్మి ఆవేదన వ్యక్తపరిచింది. తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలకు తెలియపరచి, అనంతరం స్థానిక ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు లక్ష్మీ తెలిపింది.

