కోటి సంతకాలు ప్రతులు భారీ ర్యాలీ తో కేంద్ర కార్యాలయంనకు తరలింపులో సిరమ్మ…..!..
పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు కోటి సంతకాలు తరలింపు ….!..
తన తండ్రి చిన్న శ్రీను గారు ఆదేశాలు మేరకు కోటి సంతకాలు ప్రతులు భారీ ర్యాలీ లో సిరమ్మ…!..
నవతరం: విశాఖపట్నం: నేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయద్దుఅని విశాఖజిల్లాలో అన్ని నియోజకవర్గాల ప్రజల నుండి సేకరించిన సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్, వెస్ట్ నియోజకవర్గం మల్ల విజయ ప్రసాద్, తూర్పు నియోజకవర్గం వర్గం మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గం తిప్పల దేవన్ రెడ్డి, భీమిలి నియోజకవర్గం నుంచి చిన్న శ్రీను గారు ఆదేశాలు మేరకు సిరమ్మ, ఎం ఎల్ సి వరుదు కల్యాణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంకు పంపించే కార్యక్రమంలో గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు ఆదేశాలు మేరకు తనకుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ గారు పర్యవేక్షణలో సోమవారం ఉదయం 10:00 గంటలకు భీమిలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుండి మొత్తం 6 నియోజక వర్గాలు తో ప్రారంభమైన ఈ ర్యాలీ మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వరకూ కొనసాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషం అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానం సరియైనది కాదని ప్రజలు ఈ సంతకాలుతో రుజువు చేశారన్నారు. ప్రయివేటీకరణ మూడేళ్ళ ముచ్చటే మళ్ళీ జగనన్న వచ్చి మన కాలేజీలు మన తెస్తాడు. చంద్రబాబు నీకు ఈ ఆనందం కొన్ని రోజులే అంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, తైనాల విజయ కుమార్ చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎస్సిసి గొలగాని హరి వెంకట కుమార్ శ్రీనివాస (మాజీ మేయర్, జివిఎంసి), జియాన్ శ్రీధర్
రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు, మండల, గ్రామ స్థాయి నేతలు పదవుల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనముగా కోటి సంతకాల ఉద్యమము ప్రజల తీర్పుగా భావించవచ్చు… ఈ ఉద్యమంలో ప్రతిపక్ష పాత్ర వైసిపి బాధ్యతగా నిర్వర్తించిందని చెప్పుటకు అతిశయోక్తి లేదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.




