0
289

భీమవరం పట్టణములో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ భీమవరం పట్టణంలో జరుగుతున్నాటువంటి ఆక్రమణల తొలగింపు పక్రియను పర్యవేక్షించారు.
స్థానిక జువ్వలపాలెం రోడ్, అంబేద్కర్ జంక్షన్, మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ రోడ్ లో గల రిమోవల్స్ పరిశిలించారు. హాకర్స్ జోన్ కు సంబందిచి స్తానిక వీరమ్మ పార్క్ మరియు తదితర స్థలాలను పరిశిలించి తగు చర్యలు తీసుకోనేల టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేసారు. అలాగే అర్బన్ గ్రీనరి కి సంబంధించి స్థానిక ఆదర్శ నగర్ పార్క్ ను పరిశిలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ఆ క్రమంలో తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం పట్టణంలో చిరు వ్యాపారులకు సంబంధించి ఒక చోట పెట్టుకొని వ్యాపారం చేసుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆమె సూచించారు. పార్కును అభివృద్ధి పరిచి సుందరంగా తయారు చేయాలి కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 35 వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలో సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ పథకాల క్యాలెండర్, గడువులోగా ప్రజా సమస్యల పరిష్కారం నివేదికలు వంటి వాటిని కలెక్టర్ పరిశీలించారు. వార్డులో ఏ సమస్య వచ్చినా సిబ్బంది ముదుండి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.