ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

0
152

భద్రాద్రి క్రైం, (నవతరం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా చక్కగా సహకరించారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూసిన అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.