బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అంటూ పవర్‌స్టార్ పక్కన స్టెప్పులేసింది. భద్రి సిన్మాతో పవన్‌కళ్యాణ్ జీవితంంలోకి ప్రవేశించింది. ఆయనతో దాంపత్యబంధంతో ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. చిన్నచిన్న పొరపొచ్చాలే పెద్దవై ఎవరిదారి వారు చూసుకుందామనేదాకా వచ్చాయి. కేసుల్లేవు..గొడవల్లేవు. ఎవరూ వీధినపడి ఒకర్నొకరు తిట్టుకోలేదు. జస్ట్…జంటిల్మెంట్ ఒప్పందం అంతే. తన రెండోభార్యతో తెగదెంపుల విషయంలో ఓ అగ్రిమెంట్‌కు వచ్చాడు పవన్‌కళ్యాణ్. ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు. తర్వాత ఎవరి జీవితం వారిదంటూ చెరోదారయ్యారు. పవన్‌కళ్యాణ్ రష్యన్ మోడల్ మెడలో ముచ్చటగా మూడోసారి మూడుముళ్లేశాడు.

భార్యాభర్తల బంధం తెగిపోవచ్చేమోగానీ పాత జ్ఙాపకాలైతే మనసునుంచి చెరిపేయలేం. పవన్‌కళ్యాణ్ కొత్త వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా..రేణూదేశాయ్ మాత్రం ఇప్పటికీ సింగిల్. పిల్లల్లో పవన్ జ్ఞాపకాల్ని చూసుకుంటూ గడిపేస్తున్నా అప్పుడప్పుడూ గతం ఆమె గుండె తలుపుల్ని తడుతూనే ఉంది. ఆ మధ్య తెలుగు టీవీ రియాలిటీ షోలో అతిథి పాత్రలోనూ అప్పుడప్పుడూ పాత జ్ఙాపకాలతోనే రేణూ కళ్లు చెమర్చాయి. మరో పెళ్లి ప్రస్తావన రాగానే రేణూపై పవన్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చేసింది. అయితే అది ఆమె వ్యక్తిగతమంటూ అన్ని వైపులనుంచీ నైతిక మద్దతు లభించింది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. తన జీవితంలో పాతుకుపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయంటూ వేదన కలగలిపి రాసుకున్న కవితతో కూడిన వీడియో ఇది.
‘నా మెమోరీస్‌ని చూసుకుంటున్నాను. ఆ మాటలు, పదాలు, ఆ పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాల్లో ఉన్నాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్లీ ఆ జ్ఞాపకాలు కళ్లెదుట నిలిచాయి. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కన్పించాయి”
గుండెలోతుల్లోని భావాలతో తన గొంతుకతో రేణూదేశాయ్ వదిలిన ఎమోషనల్ కవిత అందరినీ కదిలిస్తోంది. పవన్‌తో బంధాన్ని తెంంచేసుకుందన్న మాటేగానీ ఆమె గుండెలనిండా ఆ జ్ఙాపకం చెరిపేయలేనంతగా ముద్ర వేసుకుంది మరి.


