రెండు నెలల్లో మూడు తుఫాన్లు…

0
54

నవతరం: అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెలలోగా ఉత్తర బంగాళాఖాతంలో మూడు తుఫాన్లు ఏర్పడవచ్చునని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ కేంద్రం సూచించింది. సీజనల్ ఫోర్ క్యాస్ట్ కింద ఈ హెచ్చరిక చేసింది . రుతుపవనాల తర్వాత సంభవించే ఈ తుఫాన్లు కొంచెం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తోంది. 44 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉదృతంగా వచ్చే పరిస్థితి కూడా ఉందని పేర్కొంది . ఇస్రో మెటీరియోలాజికల్ మరియు ఓషీనోగ్రాఫిక్ సాటిలైట్ డేటా ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ మూడు తుఫాన్లు భూమి మీదకి వచ్చి తీవ్ర ప్రభావం చూపిస్తాయని సూచనలు ఉన్నప్పటికీ ,ఎన్ని తుఫాన్లు భూమి మీదకు వస్తాయో చెప్పలేమని కూడా పేర్కొంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మూడు నెలల్లో వచ్చే తుఫానులు తీవ్రంగాను , ఉదృతంగాను ప్రభావితం చూపే అవకాశాలు గతంలో కూడా ఉన్నాయి. అదే పరిస్థితి రుతుపవనాల తదనంతరం వచ్చే ఈ మూడు తుఫాన్లలో కూడా తలెత్తే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ విశ్లేషణ కేంద్రం తెలియజేసింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here