సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా తప్పదా?…

0
163


తేల్చనున్న సుప్రీం కోర్టు…


భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీలు, బొద్దింకల పార్టీ (సీజేపీ లో) కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలలో దేశవ్యాప్తంగా ఉద్యమం రేపారు. ఆయన ‘సర్’ ప్రక్రియలో ప్రభుత్వానికి పావులా పనిచేస్తున్నారని, మిగిలిన ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను త్రోసిపుచ్చడంద్వారా రాజ్యాంగ వ్యతిరేకత పాల్పడుతున్నారని కాంగ్రెస్ తదితర పక్షాల అభియోగం. ఆమెకు సుప్రీంలో పిటిషన్లు దఖలు అయ్యాయి. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యంగా “సర్” ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో మిగిలిన ఎన్నికల కమిషనర్ లతో ఏకాభిప్రాయం లేదని, అది చట్ట విరుద్ధమని ఆరోపించింది. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ లతో 14 సార్లు విభేదించి, వారి వాదనలను త్రోసి పుచ్చి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్షనిర్ణయాలు తీసుకున్నారని ఆ పత్రిక ఆరోపించింది. సమిష్టి నిర్ణయానికి భిన్నంగా జరిగిందని అది చట్టపరంగా చెల్లదని, న్యాయపరమైన విషయంగా పరిగణించాలని పేర్కొంటున్నది. ఆమేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్
వామపక్షాలు, సీజేపీలు ధర్నాలు,ముట్టడివంటి ఆందోళనలు చేపట్టాయి. సర్ ప్రక్రియలో భాగంగా కోట్లాది మందిని అక్రమంగా ఎన్నికల కమిషన్ తొలగించిందని ఆరోపిస్తున్నాయి. ఫాం 6 లో కూడా మార్పులు తెచ్చింది ఆరోపిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో కూడా సర్ తీరుపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో కాంగ్రెస్ గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నది. సీఈసీ రాజీనామా చేసేవరకూ తాము ఆందోళన విరమించమని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతాపార్టీ జంతర్ మంతర్ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

గత 10 నెలలుగా ఎన్నికల కమిషనర్లు సుఖబీర్ సింగ్, వివేక్ జోషి, జ్ఞానేశ్ కుమార్ మధ్య 14 సార్లు వివిధ అంశాల్లో విభేదాలు ఉన్నాయని, వాటిలో సర్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. కాని అవి సాధారణ నిర్ణయప్రక్రియలో భాగమైనని ఎన్నికల కమిషన్ పేర్కొంటూ తమ నిర్ణయాలు ఏకగ్రీవమేనని తెలిపింది. అందులో భాగంగానే వారు ముగ్గురూ పత్రికా సమావేశంపెట్టి వివరించడం గమనార్హం. ఈ సమావేశం ఏది నిజమనే విషయంలో సందిగ్ధత కల్పించింది. కాని ఇది కేవలం ప్రజల కళ్లు తుడిచే చర్యేతప్ప వాస్తవం కాదని కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమేరకు సీఈసీ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ లో అధికారపార్టీ అయిన కాంగ్రెస్ చలో లోక్ భవన్ పేరున ఆందోళన చేపట్టడం గమనార్హం. ఏదిఏమైనా 14 అభ్యంతరాలపై సీఈసీ సక్రమంగా వ్యవహరించినదా అనేది న్యాయపరంగా నిర్దారణ కావాల్సి ఉంది.
ఇంకా ఫాం 6 సంబంధించిన వివాదం కూడా ప్రధాన అంశంగా మారింది. ఫాం6 అంటే ఓటరు కొత్తగా ఓటర్లజాబితాలో నమోదు కోసం ఇచ్చే ఫాం. ‘సర్’ సందర్భంగా ఫాం 6 కు అనుబంధంగా వాడిన డాక్యుమెంటేషన్ పై వివాదం రేగింది. అలాగే ఇటీవల ఎన్నికల కమిషన్ ఫాం 6 డిక్లరేషన్ సుప్రీం కోర్టు సమర్ధించిందని పేర్కొనడం జరిగింది. కాని సుప్రీం కోర్టు తాను ఈ సవరించిన ఫాం6 ని ఆమోదించలేదని ప్రకటన జారీ చేయడం, జరిగిన మార్పులను పరిశీలిస్తామని పేర్కొనడం కొత్త ట్విస్ట్. చివరికి ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ “సర్ “విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిశీలించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆమేరకు కోర్టు కేంద్రంతో పాటు ఎన్నికల కమిషన్,ముగ్గురు కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
భారత ఎన్నికలసంఘం బహుళ సభ్యుల రాజ్యాంగ వ్యవస్థ. నిర్ణయాలు సమష్టిగా తీసుకోవాలి. సాధ్యం కాకపోతే మేజార్టీ నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అదే ప్రస్తావిస్తూ ఆమేరకు జరిగాయా లేదా అనే విషయం పరిశీలిస్తామంది. ఈసీ నిర్ణయాలకు రాజ్యాంగ బద్ధత ఉందా అనేది పరిశీలనాంతరం ప్రకటించనుంది

‘సర్’ ప్రక్రియ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని, అలాగే కొత్త ఓటర్ల నమోదులో కూడా ఎన్నికల సంఘం తీరును కాంగ్రెస్ తో సహా పలు పక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరికి తోడు కాక్రోచ్ జనతాపార్టీ కూడా జంతర్ మంతర్ వద్ద జ్ఞానేశ్ రాజీనామా కోరుతున్నది.
ఈ వివాదంలో కొసమెరుపు ఏమంటే కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం జ్ఞానేశ్ కుమార్ పీడబ్లుడీ కార్యదర్శిగా 2006లో వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గమనార్హం.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరుపై సుప్రీం కోర్టు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన విడుదల చెయ్యడం గానీ, వ్యాఖ్యలు చెయ్యడం గానీ చెయ్యలేదు.కేవలం నోటీసులు జారీచేసింది. రికార్డులు పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. మరి అత్యున్నత న్యాయస్థానం తీర్పులో జ్ఞానేశ్ భవిష్యత్తు, ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు.

యం.వి.రామారావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here