
981/1000 రావడంతో పలువురు అభినందనలు వెల్లువ…
నవతరం, ఏలేశ్వరం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అచ్చే ఆర్‌ఎస్‌ఎస్ ప్రవల్లిక 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి విశేష అత్యుత్తమ ప్రతిభ చూపింది. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ప్రవల్లిక సాధారణ కుటుంబానికి చెందిన అచ్చే వీరబాబు కుమార్తె. ప్రస్తుతం ఆమె కాకినాడలోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఐపిఎల్ క్యాంపస్ లో చదువుతోంది. ఇంతకు ముందు పదో తరగతిలో కూడా సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థానాన్ని సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఇంటర్‌లో కూడా అత్యుత్తమ మార్కులు సాధించడంతో గ్రామ ప్రజలు, నాయకులు,తల్లిదండ్రులు ఆమెను అభినందించారు. ప్రవల్లిక భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.

