అడవిని తలపిస్తున్న రుద్రభూమి…

0
31


నవతరం, ప్రత్తిపాడు: రుద్రభూమి నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిది నేడు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తీరు చూస్తుంటే రుద్రభూమి నుంచి ఆదాయం రాదని నిర్వహణ బాధ్యత గాలికొదిదిలేసిన అధికారులు. గత ప్రభుత్వం హయాంలో కొన్ని గ్రామాలకు రుద్రభూమికి ప్రహారీ నిర్మించడం జరిగింది. కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండల, పోతులూరు గ్రామంలో బతికినంత కాలం బ్రతికి, అంతిమ కాలములో దేవుని చెంతకు చేరేందుకు ఆచార ప్రకారం అగ్నికి ఆహుతి చేసి మట్టిలో కలిపేది స్మశాన వాటికలో కనీస ఏర్పాట్లు కూడా లేని పరిస్థితులు. కనీసం ఉన్నటువంటి వసతులను పర్యవేక్షణ కొరవడి పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగై అంతిమ సంస్కారాలు/దహన సంస్కారాలు చేసేందుకు అచ్చోటకు వెళ్లే వారికి వర్ణాతీతమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. దీనిపై తక్షణమే స్పందించి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here